telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ : … మరో సైబర్ నేరం… పదిలక్షలు మాయం.. బ్యాంకు మేనేజర్ కి టోపీ..

drastically increasing cyber crimes

నగరంలో సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు. వారి నేర ప్రక్రియలో బ్యాంక్ మేనేజర్లను ఆర్థిక మోసాల ఊబిలోకి దించుతుంది. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని సైబర్ మాయగాళ్లు హైఎండ్ కార్ల షోరూంలను టార్గెట్ చేస్తున్నారు. షోరూంల సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లకు బిస్కెట్ వేస్తున్న సైబర్ మోసగాళ్లు వారి బ్యాంక్ ఖాతాల వివరాలు, షోరూం యజమానుల వివారా లు, బ్యాంక్‌లకు వెళ్లే ఎగ్జిక్యూటివ్ వివరాలు, షోరూం రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీదు ఉందనే వివరాలు ఇలా ప్రతి విషయానికి సంబంధించి సమాచారం సేకరించి వాటితో షోరూం ఖాతాలను బ్యాంక్‌లకు ఫోన్ చేసి లక్షలు టోకరా వేస్తున్నారు. దీంతో బ్యాంక్ మేనేజర్లు షోరూం వారు చేశారు కదా అంటూ ఎలాంటి చెక్, ప్రత్యక్ష మనిషి లేకుండా కేవలం ఫోన్‌లోని మాటలకే నగదును ట్రాన్స్‌ఫర్ చేసి బొక్కబొర్లా పడుతున్నారు. గచ్చిబౌలీలోని ఓ బడా షోరూంకు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, మీ షోరూం నుంచి 10 బెంజ్ కార్లు కొంటాం. మాకు షోరూం యజమనితోపాటు బ్యాంక్ వివరాలు కావాలని అడిగి సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ షోరూం లింక్ ఉన్న బ్యాంక్‌కు ఫోన్ చేసి నేను షోరూం యజమానిని మాట్లాడుతున్నా నేను పంపిన ఖాతాకి డబ్బులు పంపించండని అడిగాడు.

అప్పటికి బ్యాంక్ మేనేజర్ మీ గొంతు షోరూం యజమానిదిలాగా లేదు కదా అని అడిగాడు. నాకు కొద్దిగా జ్వరం, జలబు ఉంది మా అకౌంటెంట్ చెక్ తీసుకుని వస్తున్నాడు. మీరైతే రూ.10 లక్షలు బదిలీ చేయండని కోరాడు. నిజమే అనుకున్న బ్యాంక్ మేనేజర్ రూ.10 లక్షలను కొత్త ఖాతాలోకి బదిలీ చేశారు. 3 గంటలైన అకౌంటెంట్ రాకపోవడంతో వచ్చేస్తున్నాడు. ట్రాఫిక్ జామ్‌లో ఉన్నాడని సైబర్ మాయగాడు చెప్పాడు. రూ.10 లక్షలు తన ఖాతాలోకి బదిలీ అయినట్లు నిర్ధారణ కాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. బ్యాంక్ మేనేజర్ పలుమార్లు ప్రయత్నించి చివరకు షోరూం వారిని సంప్రదించి మీరు అడిగిన రూ.10 లక్షలు వేశాను నాకు చెక్ రాలేదని అడిగాడు. షోరూం నిర్వాహకులు, యజమాని మేము అడగలేదనే సరికి బ్యాంక్ మేనేజర్ షాక్ తిని సైబరాబా ద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సైబరాబాద్ సైబర్ క్రైంపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts