telugu navyamedia
క్రైమ్ వార్తలు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం ..

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. పెద్దమ్మ గుడి వద్ద అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. ఎయిర్‌ బెలూన్స్‌ ఓపెన్‌ కావడంతో ప్రాణాపాయం తప్పింది.

అయితే.. మద్యం మత్తులో కారు నడిపినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు బీభత్సం సృష్టించిన కారును పోలీస్ స్టేషన్ తరలించారు.

Related posts