నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
2012లో పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు.. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటోంది. అయితే గతంలో రేణు దేశాయ్ రెండో పెళ్లిపై వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రెండో పెళ్లికి సిద్ధమైన రేణు దేశాయ్‌కు 2018లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు లేదు గానీ ఆమె మాత్రం వివాహం చేసుకోలేదు.
అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్‌తో ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది. ‘జీవితంలో అవసరం ఉన్నప్పుడు మనచేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి’.. అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్‌చేసింది.
ఆ తరువాత మరో పోస్ట్‌లో.. ‘మీ సోల్‌మేట్‌ను వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి’.. అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది
త్రిష, నయనతారలను తల్లి పాత్రల కోసం ఎందుకు అడగరు… హీరోయిన్ ఫైర్ ?