తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక దర్శనం టికెట్ల వ్యవహారంలో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సినీనటి అర్చన గౌతమ్ ఆరోపణలు చేయడం సంచలనం కలిగిస్తోంది.
తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చిన తనతో టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.
తాను డబ్బులు చెల్లించినప్పటికీ.. రిసిప్ట్ ఇచ్చి.. దర్శన టోకెన్ ఇవ్వలేదని ఆరోపించింది. ఈవో కార్యాలయంలోని సిబ్బంది తనను కొట్టే ప్రయత్నం చేశారని వాపోయింది. తప్పుగా ప్రవర్తించినవారిని దేవుడు శిక్షిస్తాడని కన్నీటి పర్యంతం అయ్యింది.
వీఐపీ దర్శనం కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 10,500 వసూలు చేస్తున్నారని ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ఆమె కోరింది.
తనతో తప్పుగా వ్యవహరించినవారిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో సెల్ఫీ వీడియో పోస్టు చేసింది.
भारत के हिंदू धर्म स्थल लूट का अड्डा बन चुके हैं धर्म के नाम पर तिरुपति बालाजी मैं महिलाओं के साथ अभद्रता करते,यह टीटीडी के कर्मचारी पर कार्यवाही होनी चाहिए । मैं आंध्र गवर्नमेंट से निवेदन करती हूं।ओर यह VIP दर्शन के नाम पर 10500 एक आदमी से लेते है । इसे लूटना बंद करो । @INCIndia pic.twitter.com/zABFlUi0yL
— Archana Gautam (@archanagautamm) September 5, 2022
సిద్ధార్థ్ నన్ను వాడుకున్నాడు… కానీ… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు