యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో “వరల్డ్ ఫేమస్ లవర్” అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుండగా, చిత్రానికి సంబంధించిన ప్రచారాన్ని ఇప్పటికే మొదలు పెట్టేశారు. సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్స్ నటిస్తుండగా, వారికి సంబంధించిన లుక్స్ ఒక్కో రోజు విడుదల చేశారు. డిసెంబర్ 12న ఐశ్వర్యా రాజేష్, 13న ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖన్నా లుక్స్ విడుదలయ్యాయి. ఇక కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇందులో విజయ్ దేవరకొండని చూస్తుంటే వరల్డ్ ఫేమస్ లవర్‌గా ఆయన అదరగొట్టనున్నాడని తెలుస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో మంచి ఫామ్‌లో ఉన్న గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.
previous post
next post
అలాంటి నిర్మాతలు నా దగ్గరకు రావొద్దు… త్రివిక్రమ్ ను నేనే హైదరాబాద్ తీసుకొచ్చా.. : సునీల్