telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రతిపక్షాలు ఉపాధ్యాయులను రెచ్చగొడుతున్నాయి..

టీచర్లను, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఏ మాత్రం లేదన్నారు.నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడం కోసమే మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు.. విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..

పెన్షన్‌ విషయంలో మంచి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ రంగంపై, ఉద్యోగులపై సానుభూతి ఉన్న ప్రభుత్వం తమదన్నారు. మంచి పనులు చేస్తున్నా ప్రతిపక్షాలు ఉపాధ్యాయులను సైతం రెచ్చగొడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎల్లో మీడియా కూడా రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తోందన్నారు.

పేదలు మంచి చదువులు చదవాలనేదే సంస్కరణల లక్ష్యమన్నారు. అని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందిండచమే కాకుండా మోనులో మార్పులు చేశామన్నారు. టీచర్లు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Related posts