ఏపీలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా మరో 7,948 కేసులు నమోదయ్యాయి.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,367 కేసులు, కర్నూలు జిల్లాలో 1146, గుంటూరు 945, పశ్చిమగోదావరి 757, అనంతపురం 740, కడప 650, చిత్తూరు 452, శ్రీకాకుళం 392, నెల్లూరు 369, ప్రకాశం 335, కృష్ణా 293, విశాఖ 282, విజయనగరం 220 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో మొత్తం 62,979 మంది శాంపుల్స్ ని పరిశీలించినట్టు బులెటిన్ లో అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,10,297కి చేరుకుంది. గత 24 గంటల్లో 58 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
” అమ్మ ఒడి” ని ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం: రోజా