telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కాంగ్రెస్‌ను మట్టికరిపించిన జగన్‌కు… ప్రధాని మోడీ పెద్ద లెక్క కాదు !

విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. వరుసగా మూడో  రోజు నిరసనలు హోరెత్తాయి. కేంద్రం వైఖరికి నిరసనగా మహిళలు, నిర్వాసిత గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు.  విశాఖ ఉక్కును అమ్మేది ఎవడు కొనేది ఎవడు నినాదాలతో హోరెత్తించారు.మరో వైపు, ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాటానికి ఉద్యోగ,కార్మిక,ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అయ్యాయి. దశలవారీగా అనుసరించాల్సిన వ్యూహాలను ఉద్యోగ సంఘాల జేఏసీ రూపొందించింది.  ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల ఆందోళనలో వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపించిన సీఎం జగన్‌కు… ప్రధాని మోడీ పెద్ద లెక్క కాదని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ఫైర్‌ అయ్యారు. 32 మంది ప్రాణ త్యాగంతో సాధించుకున్న స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రైవేట్‌ పరం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తిరగబడే రోజులు త్వరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై వైసీపీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. అంతేకాదు.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ప్రధాని మోడీకి స్వయంగా సీఎం జగన్‌ లేఖ రాశారని గుర్తు చేశారు ఎమ్మెల్యే అమర్‌ నాథ్. పోరాటాలు సీఎం జగన్‌కు కొత్తేమీ కాదన్నారు.

Related posts