telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్యాంకుల మూసివేత .. పుకారు మాత్రమే .. : ఆర్బీఐ

RBI

కమర్షియల్‌ బ్యాంక్ లేవీ మూతపడడం లేదు, ఇదీ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే అని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సమాధానం ఇచ్చింది. ఇటీవల పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌ వ్యాపార లావాదేవీలను నిలిపివేస్తూ ఆర్.బి.ఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల వరకూ అప్పులు ఇవ్వకూడదని ఆదేశించింది. మరోవైపు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిట్‌దారుల్ని కూడా కష్టాల్లోకి నెట్టింది ఆర్.బి.ఐ. వెయ్యి రూపాయలు మించి విత్‌డ్రా చేయడానికి వీలు లేదన్న ఆదేశాలతో అయోమయంలో పడ్డారు కస్టమర్లు. తమ డబ్బులు డ్రా చేసుకోడానికి పి.ఎమ్.సి బ్యాంక్‌ బ్రాంచీలకు పోటెత్తుతున్నారు.

పి.ఎమ్.సి బ్యాంక్‌ విషయంలో ఆర్.బి.ఐ తీసుకున్న నిర్ణయం కాస్తా … దేశంలో పలు బ్యాంకుల్ని మూసివేయబోతున్నారనే పుకార్లకు ఊతమిచ్చింది. కొన్ని కమర్షియల్‌ బ్యాంకులు మూతపడబోతున్నాయంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జోరందుకుంది. దేశంలోనే అతి పెద్ద కమర్షియల్‌ బ్యాంక్ లు ఈ జాబితాలో ఉండడంతో వినియోగదారుల్లో ఆందోళన ఎక్కువైంది. దేశంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని గ్రహించిన ఆర్బీఐ అధికారులు… సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు.

Related posts