telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఏపీ ఎన్నికల అధికారిని మార్చేసిన.. కేంద్రం…

ap election officer altered

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న సిసోడియా ను తప్పించి కేంద్రం గోపాలకృష్ణ ద్వివేదిని ఆయన స్థానంలో బాధ్యతలు అప్పగించింది. ఈ మార్పు వెనుక కూడా ఏమైనా కుట్రలు ఉన్నాయా… అంటూ ఇప్పుడు అంత చర్చలు జరుగుతున్నాయి. ఇక, 1993 బ్యాచ్‌కు చెందిన ద్వివేది ప్రస్తుతం ఏపీ పశుసంవర్దక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. గోపాలకృష్ణ ద్వివేదికి ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించ రాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

అందరి సహకారంతో ఎన్నికలను నిష్పక్షపాతముగా నిర్వహిస్తామని కొత్త ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివే ది పేర్కొన్నారు. ఓటరు జాబితాలో అవకతవకలు ఉంటే సరి చేస్తామని హామీ ఇచ్చారు. తప్పులు చేసే వారిపై చర్యలు తీసుకోవడంలో వెనుకాడబోనని తేల్చిచెప్పారు. ఓటు విషయంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటర్లు ఎప్పటికప్పుడు ఓటు ఉందో లేదో తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నా సమర్ధవంతంగా నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు ద్వివేది. ప్రస్తుతం గోపాలకృష్ణ ద్వివేదిని సీఈసీగా నియమించడంపై ఆసక్తి నెలకొంది. గోపాల కృష్ణ ద్వివేదీ గతంలో తూర్పు గోదావరి కలెక్టర్ గా.. కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి పిఎస్ గా పని చేశారు.

Related posts