telugu navyamedia
సినిమా వార్తలు

కంగనాపై నెటిజన్ల సెటైర్లు… రంగోలి ఘాటు రిప్లై

KAngana-Ranauth

వివాదాస్పద నటి, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వివాదాస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటుంది. ఆమె సోదరి రంగోలి సోషల్ మీడియా వేదికగా కంగనాకు సపోర్ట్ గా నిలుస్తుంటుంది. అయితే కావేరీ నదిని కాపాడుకోవడానికి సద్గురు “కావేరీ కాలింగ్” పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కంగనా రనౌత్, కాజల్ అగర్వాల్, తమన్నాలు తమ మద్దతు తెలిపారు. “కావేరి కాలింగ్” కోసం విరాళాలు అందించాలని అభిమానులను కోరారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ పొగరుగా ప్రవర్తించే కంగనాలో ఇంత మార్పా..? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీనిపై కంగనా సోదరి రంగోలీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. “కంగనాకు 21 ఏళ్లు ఉన్నప్పుడు రామకృష్ణ మిషన్ కు సాయం చేసిందని.. వారికొక హాస్పిటల్ కట్టించిందని.. వివేకానంద ఆశ్రమంతో చేతులు కలిపి రూరల్ ఇండియా సంక్షేమం కోసం పాటు పపడుతోంది. కంగనాకు యోగా నేర్పించిన సూర్యనారయన్ ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకొని.. ఆయనకి రెండున్నర కోట్ల విలువైన ఇంటిని కట్టించి రుణం తీర్చుకుంది. హిమాచల్ ప్రదేశ్ లో గ్రామస్తుల కోసం ఆలయాలు కట్టించింది. ఇప్పుడు తాను సంపాదిస్తున్న డబ్బు నుండి కొంత మొత్తాన్ని కావేరీ నది కోసం విరాళంగా ఇస్తుంది. కంగనా ఎప్పుడూ తన మంచి మనసును చాటుకుంటూ వచ్చింది” అని వెల్లడించింది. మూవీ మాఫియాకు కంగనాతో ఎన్ని సమస్యలు ఉన్నా.. ఆమె ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొంది.

Related posts