telugu navyamedia
సినిమా వార్తలు

‘సర్కారు వారి పాట’ ఫ‌స్ట్ సింగ్‌ల్ సాంగ్‌ లీక్‌..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలనుకున్న ఫ‌స్ట్ సింగ్‌ల్ సాంగ్‌ లీకైంది.

ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహించగా.. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా.. కళావతి పాటను సిధ్ శ్రీరామ్ ఆలపించారు.

Sarkaru Vaari Paata: Mahesh Babu Is A Superstar Playing With A Young  Heroine Abroad

ఆల్రెడీ రిలీజైన సాంగ్ ప్రోమో యూట్యూబ్‌లో నంబర్ వన్ పొజిష‌న్‌లో ట్రెండ్ అవుతోంది. ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి.ఈ క్రమంలో కళావతి పాట కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సమయంలో ఈ పాట పూర్తిగా నెట్టింట్లో లీక్ కావడంతో సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Sarkaru Vaari Paata Teaser Talk: Mass, Class And Swag

మొత్తం నాలుగు నిమిషాల పాటను కొంత మంది యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటే… మరికొంత మంది వాట్సాప్ గ్రూప్స్‌లో సర్క్యులేట్ చేస్తున్నారు.

గతంలో కూడా ఈ సినిమా టీజర్ ఇలాగే లీక్ అయ్యిందని.. ఇప్పుడు కళావతి పాట కూడా లీక్ కావడంతో… చిత్రయూనిట్‏పై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ఈ సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా  మే 12న థియేటర్లలో  విడుదలవుతుంది.

Related posts