telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీకి ప్రత్యేక హోదా తీసేస్తూ సవరణలు చేసిన‌ కేంద్ర హోంశాఖ

ఈ నెల 17న జరిగే తెలుగు రాష్ట్రాల భేటీ అజెండాలో కేంద్ర హోంశాఖ మార్పులు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించింది. అజెండాలో మార్పులు చేస్తూ తాజాగా మరో సర్య్కూలర్‌ జారీ చేసింది. 

త్రిసభ్య కమిటీలో చర్చించాల్సిన 9 అంశాల నుంచి కేవలం అయిదు అంశాలకే పరిమితం ఎజెండాను పరిమితం చేస్తూ ఈ వేళ సాయంత్రం కేంద్ర‌ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తొలుత ప్రత్యేక హోదాతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు, పన్ను రాయితీల అంశాన్ని చేర్చింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అపరిష్కృత అంశాలకు మాత్రమే పరిమితమని జీవీఎల్‌కు హోం శాఖ స్పష్టం చేసింది

ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కేంద్రం ఫోకస్‌ చేస్తోంది. ఇందుకోసం కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కొక్కరు కమిటీలో ఉంటారు.

కేంద్ర హోంశాఖ పొందుప‌రిచిన తాజా ఎజెండాలో అంశాలు ఇవే..

*ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ విభ‌జ‌న,
*ఏపీ జెన్‌కో, తెలంగాణ డిస్క‌మ్ మ‌ధ్య‌ విద్యుత్ బ‌కాయిల వివాదం.
* రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకు డిపాజిట్ల,న‌గ‌దు నిల్వ‌లువిభ‌జ‌న‌
*ఎపీఎస్‌సీఎస్ఎల్‌,.టీఎస్‌సీఎస్ఎల్ న‌గ‌దు నిల్వ‌ల అంశాల‌పై చ‌ర్చించ‌నున్న కేంద్ర హోంశాఖ అజెండాలో తెలిపింది.

శనివారం ఉదయం త్రిసభ్య కమిటీ ఎజెండాలో పేర్కొన్న 9 అంశాలు…

*ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన
*ఏపీ- తెలంగాణ మధ్య విద్యుత్‌ వినియోగ సమస్యపై పరిష్కారం
*పన్ను అంశాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం
*రెండు రాష్టాలకు సంబంధించిన బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్లు
*ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ మధ్య నగదు ఖాతాల విభజన
*ఏపీ-తెలంగాణ మధ్య వివిధ వనరుల పంపిణీ
*ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన 7 జాల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు
*ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా
*రెండు రాష్ట్రాలకు సంబంధించిన పన్ను రాయితీలు …

Related posts