telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నీళ్ల పెట్రోల్… ఎక్కడంటే..?

petrol bunk

విజయవాడ ఆటోనగర్ బంక్‌లో పెట్రోల్ కొట్టిస్తే నీళ్లు రావడంతో  వాహనదారులు కళ్లు తేలేశారు. పెట్రోల్ కొట్టించుకొని అరకిలోమీటర్‌ వెళ్లారో లేదో బళ్లు ఆగిపోయాయి.  ఏం జరిగిందో తెలియక మెకానిక్‌ దగ్గరకు పరుగెత్తారు. పెట్రోల్‌లో నీళ్లు కలిపి మోసం చేస్తున్నారంటూ అందోళనకు దిగారు. కాని అది నీళ్లు కాదని మోతాదుకు మించి  పెట్రోల్‌లో ఇథనైల్ వాడారని  తెలుసుకొని ఏమీ అర్థంకాక అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే 10 కేఎల్ పెట్రోల్‌లో ఒక కేఎల్ ఇథైనల్ కలపాలని ప్రభుత్వమే చెప్తోందని అంటున్నారు బంకు యజమాని. అలానే మోసాలకు  నిలయంగా మారింది నెల్లూరు జిల్లా కోట పట్టణంలోని ఇండియన్‌ ఆయిల్ పెట్రోల్ బంక్‌.  విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా  తీరు మారలేదు. పెట్రోల్ బంక్  చేస్తున్న దోపిడీని  వినియోగదారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని నిలదీశారు. కొక్కు పాడు రోడ్డు వద్ద నున్న ఇండియన్ పెట్రోల్ బంక్‌లో లీటరు పెట్రోల్‌ కొట్టించుకుంటే ముప్పావు వంతే రావడం చేసి  వినియోగదారులు  షాక్‌కు గురయ్యారు. 100 రూపాయలకు పెట్రోల్ ఫీడ్ చేసి బాటిల్‌లో  పెట్రోల్ పట్టించుకుంటే  లీటర్ పెట్రోల్‌ మాత్రమే వచ్చింది. కాని100 రూపాయలకు పెట్రోల్ వచ్చినట్లు చూపించడంతో వినియోగదారులు జరిగుతున్న మోసాన్ని పసిగట్టారు. పెట్రోల్  బంక్‌లో మోసాలు జరుగుతున్నాయంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. పెద్ద గొడవే అయ్యేలా ఉందని యాజమాన్యం, సిబ్బంది పెట్రోల్ బంక్ కు తాళాలు వేసి జారుకున్నారు. వినియోగదారులను మోసం చేస్తూన్నందుకు ఈ పెట్రోల్ బంక్ ను సీజ్ చేయాలని కోట మండల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Related posts