telugu navyamedia
సినిమా వార్తలు

ఆ హీరోకు రైలులో శోభనం ఏర్పాటు చేసిన దర్శకుడు..

కొన్ని సంఘటనలు ఎప్పుడు గుర్తుకొచ్చినా మధురమైన భావాలు మనసులో సందడి చేస్తాయి. పెళ్లి అనే బంధం ఇద్దరి జీవితాలను ఒకటిగా చేస్తుంది. పెళ్లయిన కొత్తలో ఇద్దరూ విడతీయలేనంతగా కలసిపోయి వుంటారు .

Pic Talk: A Newly Married Chiranjeevi

ఇక సినిమా హీరోల విషయానికి వచ్చేటప్పటికి ఆ జీవితం కొంచెం భిన్నంగా ఉంటుంది . ఎందుకంటే హీరోలు షూటింగ్‌ల‌తో ఎప్పుడూ తీరికలేకుండా వుంటారు . ఒక్కోసారి మద్రాస్ వదిలి అవుట్ డోర్ వెళ్ళాల్చి రావచ్చు. అప్పుడు భార్య‌భ‌ర్త‌ల‌ మధ్య కొంత ఎడబాటు తప్పదు.

Megastar Chiranjeevi on Twitter: "Happy Anniversary to MEGA COUPLE #MegaStarChiranjeevi garu and #Surekha Garu https://t.co/qbbMq6uvvR" / Twitter

ఒక్కోసారి నిర్మాత, దర్శకుల అనుమతితో హీరోలు తమ భాగ స్వాములను వెంట తీసుకెడతారు. 1980 ఫిబ్రవరి 20 అప్పుడే సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవికి అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో వివాహం జరిగింది. చిరంజీవి ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఊటీలో అని నిర్మాత చెప్పాడు. చిరంజీవికి అప్పుడే వివాహం అయ్యింది. భార్య సురేఖను వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పడం లేదు . అందుకే ఈ విషయాన్నీ ఆ చిత్ర నిర్మాతకు చెబితే ‘అయితే ఆమె ను కూడా తీసుకురండి ” అన్నారు. చిరంజీవికి మహా సంతోషం వేసింది . మొదటిసారి తన భార్య సురేఖతో కలసి ఊటీ వెడుతున్నాడు . ఆ భావనే అతనికి కిక్కు ఇచ్చింది. ఈ విషయం సురేఖకు చెబితే ఆమె కూడా సంబరపడింది.
ఇద్దరూ కలసి ఊటీ వెళ్లారు .

Have you seen this photo of Chiranjeevi, wife Surekha? | Deccan Herald

అక్కడ సరదాగా గడిపారు . భర్త షూటింగ్ చేస్తుంటే సురేఖ అబ్బురంగా చూసేది. షూటింగ్ పూర్తి అయిన తరువాత మద్రాస్ ప్రయాణమయ్యే రోజున దర్శకుడిని కలసి “భార్య తో కలసి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు . అదే రోజు సాయంత్రం ఊటీ నుంచి క్రింద వున్న మెట్టుపాళయం స్టేషన్ లో రైలు ఎక్కితే మద్రాస్ చేరతారు. చిరంజీవి , సురేఖ యూనిట్ తో పాటు క్రిందకు వచ్చారు. స్టేషన్లో వున్న ప్రొడక్షన్ మేనేజర్ “సర్ మీ ఇద్దరికీ కూపే బుక్ చేశాము ” అని చెప్పాడు.

Chiranjeevi and surekha ruby jubilee wedding anniversary - Sakshi

అది విని చిరంజీవి ఎంతో ఆశ్చర్యపోయాడు . తనలాంటి చిన్న నటుడుకు కూపే నా ? అనుకున్నాడు. ఈ విషయం సురేఖకు చెబితే ఆమె చాలా సంతోషపడింది. ఇద్దరూ ట్రైన్ ఎక్కి తమకు రిజర్వు చేసిన కూపే లోకి వెళ్లారు . అంతే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు . తాము నిజంగానే తమకు కేటాయించిన కూపే లోకి వచ్చామా ? పొరపాటున మరో దానిలోకి వచ్చామా ? అని డోర్ దగ్గరే నిలబడ్డారు . అక్కడే వున్న ప్రదిక్షన్ మేనేజర్ ” ఇది మీదే సర్ ” అని చెప్పాడు. కూపే లోపల పూలు , పళ్ళు ,పాలు ఏర్పాటు చేశారు . కూపే అంత అగరొత్తుల సువాసనతో నిండిపోయింది. ఈ ఏర్పాటు చూసి సురేఖ సిగ్గుపడిపోయింది . చిరంజీవి కొత్త పెళ్లి కొడుకులా ముసిముసి నవ్వులు సురేఖ వైపు విసిరాడు .

Chiranjeevi-K Raghavendra Rao: మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మెగా బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌..

ఇంతకీ ఇలాంటి శోభనం ఏర్పాటు చేసిన ఆ దర్శకుడు ఎవరో తెలుసా ? కే. రాఘవేంద్ర రావు . ఆ సినిమా మోసగాడు .రాఘవేంద్ర రావు తెర మీదనే కాదు తెర వెనుక కూడా చిలిపి కృష్ణుడే . ఈ సంఘటన “పెళ్లి సందడి ” సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రంలో చిరంజీవి రైలులో ఏర్పాటు చేసిన శోభనం గురించి స్వయంగా వివరించారు .. రాఘవేంద్ర రావు స్టయిలే వేరప్పా ! మహా చిలిపి !!

Related posts