telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మక్కాలో సీనియర్‌ దర్శకుడు రాజ్ కపూర్ కుమారుడి కన్నుమూత

Raj-Kapoor

కోలీవుడ్ సీనియర్‌ దర్శకుడు రాజ్‌కపూర్ కు భార్య సజీలా కపూర్, కుమారుడు షారూఖ్‌ కపూర్, కుమార్తెలు షమీమా, షానియా ఉన్నారు. కొడుకు షారూఖ్‌ కపుర్‌ సోమవారం మక్కాలో అనూహ్యంగా మృతి చెందాడు. ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. ఇతను కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. అతని ఆరోగ్యం బాగుపడితే మక్కాకు వస్తామని అతని తల్లి మొక్కుకున్నారట. షారూక్‌ కపూర్‌కు ఆరోగ్యం బాగుపడడంతో రాజ్‌కపూర్‌ భార్య కొడుకును తీసుకుని మక్కాకు వెళ్లారు. అక్కడ వాతావరణం అతి శీతలంగా ఉండడంతో షారూఖ్‌ కపూర్‌ ఇంతకు ముందే శ్వాసకోశ సంబంధిత సమస్య ఉండడంతో అనారోగ్యానికి గురయ్యాడు. వాతావరణ ప్రభావం ఏమో అని అతని తల్లి అనుకున్నారు. దీంతో షారూఖ్‌ కపూర్‌ శ్వాసకోశ సమస్య కారణంగా అనూహ్యంగా సోమవారం మక్కాలోనే కన్ను మూశాడు. ఊహించని ఆ పరిణామంతో దర్శకుడు రాజ్‌కపూర్‌ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో సినీ పరిశ్రమ షాక్‌కి గురైంది. ఇక రాజ్ కపూర్ ‘తాలాట్టు కేట్కు దమ్మా’, ‘అవన్‌ వరువాళా’, ‘ఆనంద పూంగాట్రు’ తదితర చిత్రాలను తెరకెక్కించారు.

Related posts