telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా… ‘మేనల్లుడా మజాకా’

saitharam-tej

‘చిత్ర లహరి’, ‘ప్రతిరోజు పండగే’ వంటి వరుస హిట్ చిత్రాలతో జోరు మీద వున్నాడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్‌. సాయి ధరమ్‌ తేజ్‌ 14 మూవీని క్లాప్ కొట్టి లాంఛ్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ‘ప్రస్థానం’ ఫేమ్.. దేవ్ కట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తేజ్ సరసన నివేదా పేతు రాజ్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని భగవాన్, జె పుల్లారావులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో వీరు గోపీచంద్‌తో గౌతమ్ నంద చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్‌ తేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాకు కొబ్బరి కాయ కొట్టేశారు సాయి ధరమ్ తేజ్. కాగా ఈ చిత్రానికి ఓ ఆసక్తికరమైన టైటిల్ ప్రచారంలో ఉంది.. మేనల్లుడా మజాకా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.

 

Related posts