ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా “రంగమార్తాండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ పైకి వెళ్లింది. విశాఖపట్నంలో చిత్ర షూటింగ్ జరుపుకుంటుండగా, దర్శకుడు తేజ సెట్స్‌లో అడుగుపెట్టారు. తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఆస్ట్రాలజర్ బాలు మున్నంగి క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశానికి ప్రముఖ జ్యోతిష్యుడు బాలుమున్నాగి క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రఫర్ రత్నవేలు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. చిత్ర షూటింగ్‌ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది రిలీజ్‌కి సిద్ధం చేయాలని కృష్ణవంశీ భావిస్తున్నారట. చిత్రంలో బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఆయన రోల్ హృదయాలని పిండేసేలా ఉంటుందట. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. అయితే..ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం రమ్యకృష్ణపై కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారట చిత్ర యూనిట్. ఇప్పటికి 80 శాతం టాకీ పార్టును సినిమా పూర్తి చేసుకోగా.. త్వరలోనే ప్రకాశ్ రాజ్- రమ్యకృష్ణ మధ్య వచ్చే సీన్లు చిత్రీకరించనున్నట్టు టాక్. ఈ చిత్రంలో అనసూయ నాటకాలు వేసే కాళాకారిణిగా కనిపిస్తుందని తెలుస్తోంది.
previous post