అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, కృతి శెట్టి లు ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు.
‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్లో నటించిన నాగార్జున, రమ్యకృష్ణ.. ఇందులోనూ అదే పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, విడియోలు, సాంగ్స్ ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ‘బంగార్రాజు’ సినిమా నుండి ‘నాకోసం’ అంటూ సాగే సాంగ్ టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో జోడీగా కనిపించిన నాగచైతన్య, కృతిశెట్టి.. అభిమానుల్ని అలరిస్తున్నారు.
సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడగా అనూప్ రూబెన్స్ సంగీతమంధించిన పూర్తి సాంగ్‌ను డిసెంబర్ 5 వ తేదీన సాయంత్రం 5:12 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.