“బాహుబలి”తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ను సంపాదించుకున్న రానా దగ్గుబాటి ప్రస్తుతం తెలుగులో “విరాటపర్వం” సినిమాతో బిజీగా ఉన్నాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం”, హిందీలో “హాథీ మేరే సాథీ” సినిమాల్లో నటిస్తున్నారు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. అయితే “బాహుబలి” సినిమాలో కండలు తిరిగిన శరీరంతో కనిపించిన రానా ఈ మధ్య కాలంలో బాగా సన్నబడిపోయాడు. దాంతో రానా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరిగింది. అయితే తాజా ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ అలాంటిదేం లేదని తేల్చేశాడు. “హాథీ మేరే సాథీ” సినిమా కోసమే సన్నబడ్డట్టుగా చెప్పుకొచ్చాడు. రానా గతకొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్టు మరో కొత్త వార్త హల్చల్ చేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ నెల 18న చికాగోలో రానాకి సంక్లిష్టమైన సర్జరీ పూర్తైందట. ప్రస్తుతం అతని ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని, మూడు నెలల తర్వాత రానా యాక్షన్ మొదలు పెట్టనున్నాడని అంటున్నారు.
అక్రమ సంబంధాలు సాధారణమే… దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు