telugu navyamedia
సినిమా వార్తలు

“డియర్ కామ్రేడ్”కు పోటీగా ఆరు సినిమాలు

Dear-Comrade

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌ బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్న ఎమోష‌న‌ల్ డ్రామా “డియ‌ర్ కామ్రేడ్‌”. “యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌” ట్యాగ్ లైన్‌. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. “డియర్ కామ్రేడ్‌” ఈ నెల 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శృతి రామచంద్రన్, సుహాస్, చారు హాసన్, ఆనంద్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. అయితే తెలుగులో ఈ చిత్రానికి పోటీగా మ‌రే సినిమా విడుద‌ల కాక‌పోయిన‌, త‌మిళంలో మాత్రం ఆరు సినిమాలు పోటీ ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యాయి. కోలీవుడ్‌లో జూలై 26న స్టార్ కమెడియన్ సంతానం నటించిన ఏ1, లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొలైయుధిర్ కాలం, దర్శకుడు సముద్ర ఖని నటించిన కొలాంజి, నుంగంబాకం,చెన్నై పళని మార్స్, ఆరడి అనే చిత్రాలు విడుద‌ల‌కి సిద్దం అయ్యాయి. ఈ చిత్రాల‌లో ఏ1,కొలైయుధిర్ కాలంకి అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మ‌రి ఈ చిత్రాల‌తో డియ‌ర్ కామ్రేడ్ పోటీ ప‌డ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌తో చెన్నైలో దుమ్ము రేపిన విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాపై భారీ అంచనాలు పెంచాడు. ఇప్ప‌టికే నోటా సినిమాతో కోలీవుడ్‌లో బోల్తా ప‌డ్డా విజ‌య్ దేవ‌ర‌కొండకు అక్కడ ఈ సారైనా హిట్ దక్కుతుందేమో చూడాలి.

Related posts