telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేమలో పడిన పాయల్… అతనేనా ?

Payal-Rajputh

“ఆర్ఎక్స్ 100” చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న బోల్డ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాయల్ కు తెలుగులో ఆఫర్ల వెల్లువ మొదలైంది. పాయ‌ల్ రాజ్ పుత్ ప్ర‌స్తుతం “వెంకీమామ” చిత్రంలో వెంకటేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ర‌వితేజ “డిస్కోరాజా” చిత్రంలోను ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే “RDX ల‌వ్‌” అనే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలోను న‌టిస్తుంది. ప్ర‌స్తుతం త‌న కాల్షీట్స్‌ ఖాళీ లేకుండా చేసుకున్న ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న ఫోటోల‌తో పాటు సినిమాల‌కి సంబంధించిన పోస్ట‌ర్స్‌ని షేర్ చేస్తుంది. రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్య‌క్తితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఫొటోకు మూడు ల‌వ్ సింబ‌ల్స్‌ని జత చేశారు. దాంతో నెటిజన్లు పాయ‌ల్‌ ప్రేమలో పడిందా ?, అతన్ని పాయల్ ప్రేమిస్తుందా ? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మ‌రి దీనిపై క్లారిటీ రావాలంటే పాయ‌ల్ స్పందించాల్సిందే.

 

View this post on Instagram

 

🖤💟🖤

A post shared by Payal Rajput (@rajputpaayal) on

Related posts