telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్ ?

RP

“అల.. వైకుంఠపురములో” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్.. తన తర్వాతి సినిమాని తారక్‌తో తెరకెక్కించనున్నారు. ‘అయినను పోయిరావలె హస్తినకు..’ అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో `అరవింద సమేత` సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారు. అందుకే ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” పూర్తి చేసేలోపు త్రివిక్రమ్ మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఆ సినిమా కోసం త్రివిక్రమ్… యంగ్ హీరో రామ్ ను సెలక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇటీవల “ఇస్మార్ట్ శంకర్”తో భారీ విజయాన్ని అందుకున్న రామ్ ప్రస్తుతం ‘రెడ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ముగింపు దశలో ఉంది. దాని తర్వాత ఏ ప్రాజెక్ట్ కు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందుకే త్రివిక్రమ్ అడగ్గానే రామ్ ఓకే చెప్పేశారని సమాచారం. త్వరలోనే వీరి ప్రాజెక్ట్ గురించిన వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు.

Related posts