telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్లిపై క‌న్నడ హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Sanjana

క‌న్నడ హాట్ బ్యూటీ సంజ‌న ఇటీవల కాలంలో తన కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తోంది. పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా బుజ్జిగాడు సినిమాతో ప‌రిచ‌యం అయిన ఈ అమ్మ‌డు దండుపాళ్యం వంటి బోల్డ్ చిత్రాల‌లోను న‌టించింది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల‌లో ప‌లు సినిమాలు చేసిన సంజ‌న ప్ర‌స్తుతం వెబ్ సిరీస్‌లో న‌టిస్తుంది. అయితే సంజ‌న‌ చాలా రోజులుగా ఒక యువకుడితో ప్రేమలో ఉన్నట్లు వార్త‌లు రాగా, ఫ్యామిలీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని పుకార్లు షికారు చేశాయి. ఈ నేప‌థ్యంలో సంజన కాస్త సీరియస్ అయ్యింది. అందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. నిజానికి సంజ‌న‌ ఒక యువకుడితో లవ్ లో ఉన్నట్లు గ‌తంలో ఒప్పుకుంది. అయితే ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానో లేదో తనకు తెలియదని, అలాగే జీవితంలో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో ఎవరికీ తెలియదంటూ బ్యూటీ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది సంజ‌న‌. ఈ అమ్మ‌డి హాట్ కామెంట్స్ మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Related posts