పాన్ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ప్రేమ కథతో పాటు అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు.
దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. తొలి రోజు రూ.79 కోట్లు వసూలు చేసిన ‘రాధేశ్యామ్’ కలెక్షన్లు.. రెండో రోజుకు రూ.119 కోట్లకు (గ్రాస్) చేరుకున్నాయి.
1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిత్రం నుంచి నిన్నేలే నిన్నేలే అనే ఫుల్ వీడియో సాంగ్‌ని రిలీజ్ చేశారు. ‘నిన్నేలే నిన్నేలే.. నిన్నే నమ్మాలే ఏముంది నా నేరమే’ అంటూ ఎంతో భావోద్వేగంతో ఈ సాంగ్ సాగుతుంది.
ఈ సినిమాకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.