telugu navyamedia
సినిమా వార్తలు

66 సంవత్సరాల “సంపూర్ణ రామాయణం” (తమిళం)

నందమూరి తారక రామారావు గారు మొట్ట మొదటి సారి పూర్తి స్థాయిలో శ్రీరాముడు గా నటించిన చిత్రం ఎం.ఏ.వి. పిక్చర్స్ వారి “సంపూర్ణ రామాయణం” తమిళ సినిమా 14-04-1958 విడుదలయ్యింది.

నిర్మాత ఎం.ఏ.వేణు. గారు ఎం.ఏ.వి. పిక్చర్స్ బ్యాానర్ పై దర్శకుడు కె.సోము గారి దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: ఏ.పి. నగరాజన్, పాటలు: మారుతకాశి, సంగీతం: కె.వి.మహదేవన్, ఫొటోగ్రఫీ: వి.కె.గోపన్న, నృత్యం: చిన్నిలాల్, మరియు ఎం.సంపత్ కుమార్, కళ: ఎం.పి.కుట్టియప్పు, ఎడిటింగ్: టి.విజయరంగం. సమకూర్చారు.

ఈ చిత్రం లో ఎన్.టి.రామారావు గారు శ్రీ రాముడు గాను, పద్మిని సీతాదేవి గాను శివాజీ గణేషన్ భరతుడు గాను నటించారు. ఇక మిగిలిన పాత్రలలో టి.కె.భగవత్, నాగయ్య, జి. వరలక్ష్మి, ఎం.ఎన్.రాజం, సంధ్య , నరసింహ భారతి, పుష్పవల్లి, ఏ.కె.మోహన, సాండో కృష్ణన్ తదితరులు నటించారు.

ఈ సినిమాలో ఎన్.టి.రామారావు గారికి వాయిస్ కు వి. శ్రీనివాసన్ డబ్బింగ్ చెప్పటం జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ గారి. స్వరకల్పనలో వెలువడిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

1958 ఏప్రిల్ 14 వ తేదీ, తమిళ ఉగాది నాడు ఎన్.టి.ఆర్ గారు శ్రీరాముడిగా నటించిన “సంపూర్ణ రామాయణం” తమిళ్ సినిమా విడుదలై ఘనవిజయాన్ని సాధించి, తమిళనాడు రాష్ట్రంలో ఏకధాటిగా 264 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ సృష్టించింది.

ఈ సినిమా మద్రాసు (చెన్నై) నగరం లోని చిత్ర, బ్రాడ్వే, సయాని, కామధేను ధియేటర్ల లో (ఈ నాలుగు థియేటర్లలో) 50 రోజులు ప్రదర్శింపబడి రికార్డ్ సృష్టించింది.

ఈ చిత్రం తమిళనాడు రాష్ట్రంలోని మధురై, తిరుచునాపల్లి, సేలం, కోయంబత్తూరు, తంజావూరు, మద్రాసు సిటీ లతో పాటు పలు కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి. శతదినోత్సవాలు జరుపుకున్నది. కాగా ఈ సినిమా శతదినోత్సవ వేడుకలను మధురైలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

మధురై – శ్రీదేవి ధియేటర్ లో 165 రోజులు ప్రదర్శింపబడింది ఈ చిత్ర శతదినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు రైలులో వచ్చిన ఎన్.టి.రామారావు గారిని చూసేందుకు ప్రజలు విపరీతంగా విచ్చేసి ఆయనకు బ్రహ్మ రధం పట్టారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమిళ నాడు ప్రజానాయకుడు రాజాజీ గా పిలువబడే చక్రవర్తుల రాజగోపాలాచారి గారు సైతం ప్రజల ఆరాధ్య దైవం శ్రీరాముడు మన చెంతకు విచ్చేశారు అంటూ ఎన్టీఆర్ గారిని ఘనంగా కొనియాడారు.

రాజగోపాలాచారి గారు చూసిన ఒకే ఒక్క సినిమా “సంపూర్ణ రామాయణం” అని చెబుతారు. ఆనాటి
శతదినోత్సవ సభలో నటీ నటులందరికీ వెండి కప్పులను బహుకరించడం జరిగింది.

ఈ సినిమా తమిళనాట రజతోత్సవం (సిల్వర్ జూబ్లీ) కూడా జరుపుకుని, ఏకంగా 264 రోజులు ప్రదర్శింపబడింది.
ఈ సినిమాను తెలుగు, హిందీ భాషలలోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు.

తెలుగులో “సంపూర్ణ రామాయణం” పేరు తో తెలుగు వారి సంక్రాంతి రోజు 14-01-1959 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనది. హిందీలో  “రామాయణ” పేరుతో 1960 లో విడుదల కావటం జరిగింది . ఈ రెండు భాషల్లో ను ఈ సినిమా విజయం సాధించింది.

Related posts