telugu navyamedia
సినిమా వార్తలు

క్యాన్స‌ర్‌తో పొరాటం చేస్తున్న హంస నందిని..

ఆర్య రాజేష్ నటించిన అనుమానస్పదం సినిమాతో హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది హంసానందిని. ఆ త‌రువాత పంతం, ఈగ ‘మిర్చి’, ‘అత్తారింటికి దారేది, లెజెండ్‌, రుద్రమదేవి వంటి పలు చిత్రాల్లో నటించి త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్ననటి హంస నందిని.

Hamsa Nandini signs up a womencentric project

ఇటీవల క్యాన్సర్‌ బారిన ఆమె తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తెలియజేశారు. ప్రస్తుతం తాను క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నానని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తానని ఆమె అన్నారు.వంశ పారంపర్యంగా వచ్చే బ్రెస్ట్ కాన్సర్ ఉందని హంసా నందిని ట్విట్టర్ అకౌంట్‌లో పేర్కొన్నారు.

“కాలం నా జీవితంలో ఏవిధమైన ప్రభావాలు చూపినా.. బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదు. భయం, ప్రతికూల భావాలతో జీవించను. ధైర్యంగా ప్రతి కష్టాన్ని ఎదుర్కొని ముందడుగు వేయాలనుకుంటున్నా. 18 సంవత్సరాల క్రితం క్యాన్సర్‌తో నా తల్లి కన్నుమూశారు. నాటి నుంచి నేను అదే భయంతో జీవిస్తున్నా. నాలుగు నెలల క్రితం రొమ్ములో కణతి ఉన్నట్లు అనిపిస్తే వైద్యుల్ని సంప్రదించాను. పరీక్షల అనంతరం నాకు రొమ్ము క్యాన్సర్‌ గ్రేడ్‌-3 దశలో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. సర్జరీ చేసి ఆ కణతిని తొలగించారు. క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని భావించాను.

Hamsanandini: షాకింగ్ న్యూస్.. సినీనటి హంసానందినికి క్యాన్సర్.. గ్రేడ్‌ 3‏గా నిర్దారణ..

కానీ, ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. జన్యుపరమైన క్యాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. దాని ప్రకారం బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం 70శాతం లేదా గర్భాశయ క్యాన్సర్‌ బయటపడే అవకాశం 40 శాతం ఉంది. ఆ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే సర్జరీలు చేయించుకోవడం ఒక్కటే దారి. ప్పటివరకు 9 సైకిల్స్ కీమోథెరపీ జరిగాయి.. మరో 7 సైకిల్స్ చేయించుకోవాల్సి ఉంది. 

ఈ మహమ్మారికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకోవడం లేదు. నవ్వుతూ ధైర్యంగా పోరాడాలనుకుంటున్నా. దీనితో పోరాడి.. నవ్వుతూ మీ ముందుకు వస్తాను. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాడానికే ఈ పోస్ట్ చేస్తున్న అని చెప్పుకొచ్చింది హంసానందిని. ప్ర‌స్తుతం ఆమె డాక్ట‌ర్స్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు.

Related posts