telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీటిమార్ : కబడ్డీ కోచ్ గా సీరియస్ లుక్ లో తమన్నా

Seetimar

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మాత‌గా హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోన్న‌ భారీ చిత్రం` సీటీమార్‌`. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. తరుణ్ అరోర ప్రతి నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సీటీమార్’ ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఈ చిత్రం నుండి తాజాగా తమన్నా లుక్‌ను విడుదల చేశారు. కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డిగా మిల్కీబ్యూటీ లుక్ అదిరిపోయింది. సీరియస్ లుక్‌లో తమన్నా కొత్తగా కనిపిస్తున్నారు. జ్వాలా రెడ్డిగా తన లుక్‌‌పై తమన్నా మాట్లాడుతూ.. ‘‘చాలా ఆసక్తికరమైన, స్ఫూర్తిమంతమైన, ఛాలెంజింగ్ రోల్ కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి. గోపిచంద్‌తో మొదటిసారి క‌లిసి నటిస్తున్నాను. అలాగే, సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ తర్వాత చేస్తోన్న సినిమా ఇధి. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బేనర్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉంది’’ అని అన్నారు.

Related posts