వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న, సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన “మహర్షి” సినిమా మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో చిత్రయూనిట్‌కు స్టార్ హీరోయిన్ సమంత శుభాకాంక్షలు తెలియజేసింది. “ఆల్ ది బెస్ట్” అంటూ ఓ వీడియో బైట్ విడుదల చేసింది. ఈ వీడియో బైట్ పంపినందుకు మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా ద్వారా సమంతకు ధన్యవాదాలు తెలిపారు. “మీరు మా ఫ్యామిలీ ఫేవరెట్ సామ్.. సితార మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తుంది. “మహర్షి”కి శుభాకాంక్షలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు” అని నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. సమంత మాట్లాడిన వీడియో బైట్‌ను కూడా పోస్ట్ చేశారు నమ్రత.