telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విరాట్ ను కౌగిలించుకున్న ఊర్వశి… ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పిక్…!?

Urvasi-and-Virat-Kohli

టీమిండియా క్రికెట్ జట్టు పాకిస్థాన్ జట్టుపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ విగ్రహాన్ని ప్రముఖ సినీనటి ఊర్వశీ రౌతేలా ఆలింగనం చేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్ గా మారింది. టీమిండియా జట్టు సారథి విరాట్ కోహ్లీకి మద్ధతు ఇచ్చేందుకే తాను ఈ ఫోటోను పోస్టు చేశానని ఊర్వశీ ప్రకటించారు. అయితే ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి ఊహించని స్పందన వస్తోంది. ఊర్వశీ పోస్టు చేసిన ఫోటోను కోహ్లీ భార్య అనుష్కశర్మకు జోడించి పలు రకాల నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీతో ఊర్వశీ ఫోటో చూసి అనుష్క దిగులుగా ఉందంటూ మరో నెటిజన్ ఓ ఫోటోను జోడించారు. ఊర్వశీ పెట్టిన ఫోటోకు వెల్లువలా కామెంట్లు వచ్చిపడుతున్నాయి. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అయితే ఊర్వశి ఆలింగనం చేసుకుంది విరాట్ విగ్రహాన్నే అయినా నెటిజన్లు ఈ విధంగా స్పందించడం గమనార్హం.

Related posts