తమిళ హీరో శింబు సరసన నటించి కోలీవుడ్‌కు పరిచయమైంది శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి. ఆ చిత్రం అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకొని ప్రస్తుతం బిజీగా ఉంది. బాలా దర్శకత్వం వహించిన “తారాతప్పట్టు” చిత్రం ద్వారా కోలీవుడ్‌ను ఆకట్టుకున్న వరలక్ష్మికి వరుసగా వైవిధ్యమైన ప్రాముఖ్యత కలిగిన పాత్రలే వస్తున్నాయి. విజయ్ “సర్కార్’, విశాల్ ‘సండకొళి-2″లో ప్రతి నాయకిగా కనిపించి అభిమానులను అలరించింది వరలక్ష్మి.
ఇటీవల ధనుష్ “మారి-2″లో ఐఏఎస్ అధికారిగా చాలా కూల్ పాత్రలో నటించింది. ప్రస్తుతం జై సరసన “నీయా-2″లో మళ్లీ గ్లామర్ పాత్రలో నాగినిగా తన అందచందాలను చూపించనుంది. ప్రస్తుతం “కన్నిరాశి”, “రాజపార్వై”, “వెల్వెట్ నగరం”, “ఛేజింగ్” చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ అమ్మడు బిజీగా వుంది. ఆమె నటిస్తున్న “రాజాపార్వై” చిత్రంలో ఐపీఎస్ అధికారిగా పవర్‌ఫుల్ రోల్‌లో నటిస్తోంది. పోలీస్ డ్రస్ వేసుకొని తన కోరికను నెరవేర్చుకుంది. అందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసింది. అందులో “తాను మరో జన్మంటూ ఉంటే ఐపీఎస్ అధికారిగా అయ్యేందుకు ప్రయత్నిస్తానని” తన మనస్సులోని కోరికను బయటపెట్టింది ఈ బ్యూటీ.
రనుమండల్ పై లతా మంగేష్కర్ వ్యాఖ్యలు… హిమేష్ రేష్మియా మద్ధతు