telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు భాగ్య‌న‌గ‌రానికి రాష్ట్రపతి..పర్యటన షెడ్యూల్

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో 12వ రోజు శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. స‌మ‌తామూర్తిని రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు ద‌ర్శించుకుంటున్నారు.

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌  ముచ్చింతల్‌లోని జరిగే శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు నేడు  హైదరాబాద్‌కు రాబోతున్నారు. 

రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ..

రాష్ర్ట‌ప‌తి మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు రాష్ట్రపతి.. బేగంపేట్‌లో రాష్ట్రపతికి గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్‌ తదితరులు ఆహ్వానం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో జీయర్ ఆశ్రమానికి మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటారు.

అనంతరం భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహ ఆవిష్కరించనున్నారు. అనంత‌రం ఆలయాలు, బృహాన్‌మూర్తి విగ్రహాన్ని సందర్శిస్తారు. శ్రీరామానుజాచార్యుల స్వర్ణ విగ్రహ ఆవిష్కరణ అనంతరం సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శించనున్నారు. అనంతరం రాష్ట్రపతి ఆడిటోరియంలో ప్రసంగించనున్నారు.

మ‌రోవైపు… రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్, శంషాబాద్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ రావ‌ద్ద‌ని పోలీసులు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో ఎవరిని అనుమతించబోమని పేర్కొన్నారు.

Related posts