telugu navyamedia
తెలంగాణ వార్తలు

గాంధీల కుటుంబాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌కుడ‌దా ..?

*సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు అస్సాం సీఎం హిమంత బిస్వా కౌంట‌ర్‌
*గాంధీల కుటుంబాల‌పై విమ‌ర్శ‌లు చేయ‌కుడ‌దా..?
*స‌ర్జిక‌ల్ స్ర్ట‌యిక్ పై రాహుల్ ఆధారాలు అడిగారు..
*బిపిన్‌రావ‌త్‌ఫై రాహుల్‌ వ్యాఖ్య‌లు చేశాడు ..

సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు అస్సాం సీఎం హిమంత బిస్వా కౌంట‌ర్ ఇచ్చాడు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ కుమారుడే అన్న విషయానికి ఆధారాలు చూపాలని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా సీఎం కేసీఆర్ ఖండించారు.

ఈ క్రమంలో అస్సాం సీఎంను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని బీజేపీని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. భారత స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాహుల్‌ గాంధీ కుటుంబ సభ్యులు ప్రాణాలు ఇచ్చారని.. అలాంటి వారిపై ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. బీజేపీ పూర్తిగా దిగజారిపోయిందని, ఇదేనా ధర్మం, హిందూత్వం అంటూ మండిపడ్డారు .

దీనికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కౌంటర్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రయిక్‌పై రాహుల్ ఆధారాలు అడిగారని.. బిపిన్ రావత్‌పై వ్యాఖ్యలు చేశారంటూ అసోం సీఎం పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులపై మాట్లాడకుడదా అంటూ ప్రశ్నించారు. గాంధీ కుటుంబంపై విమర్శలు చేయకుడదా అంటూ హిమంత బిశ్వ శర్మ ప్రశ్నించారు. కేసీఆర్‌కు తాను మాట్లాడిందే తప్పులా అనిపించిందా..? అంటూ అస్సాం సీఎం వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీపై తాను చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ సీఎం కేసీఆర్ రెచ్చిపోయారు.. కానీ మన సైన్యంపై గాంధీ మాట్లాడిన అంశంపై ఎందుకు మాట్లాడలేదన్నారు. గాంధీ కుటుంబాన్ని విమర్శించకూడదన్న కేసీఆర్ ఆలోచన ధోరణి మారాలని అంటూ అసోం సీఎం హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు.

Related posts