telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

మాస్కులు ధరించని 67,557 మందిపై కేసులు

mask corona

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ముఖానికి మాస్కులు ధరించకుండా బహిరంగంగా చక్కర్లు కొడుతున్న 67,557 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, మరో 3,288 మందికి ఈ-చలానాలు జారీ చేసినట్టు చెప్పారు. 22 మార్చి నుంచి 30 జూన్ మధ్య ఈ కేసులు నమోదైనట్టు తెలిపారు.

ఇక, రాజధాని హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 14,931 కేసులు నమోదు కాగా, రామగుండం కమిషనరేట్ పరిధిలో 8,290, ఖమ్మంలో 6,372, సూర్యాపేటలో 4,213, వరంగల్‌లో 3,907 మందిపై కేసులు నమోదు కాగా, అత్యల్పంగా భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

Related posts