telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉత్తరకొరియా : .. నియంత పాలనలో .. నలిగిపోతున్న అందం..

president hard decisions troubles women in

ఉత్తర కొరియా దేశం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నియంతలు అధికారంలో ఉన్న దేశం. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ క్రూరత్వం గురించి ఆ దేశంలో కథలుగా చెప్పుకుంటున్నారు. ఇటీవలే ట్రంపు తో జరిగిన చర్చలు విఫలం కావడానికి కారణం అయ్యారంటూ ఐదుగురు అధికారులకు కిమ్ మరణశిక్ష విధించారు. కిమ్ ఎంతటి నియంతో.. అంతటి విలాస పురుషుడు కూడా. రాజప్రసాదంలో పనిచేసేందుకు దేశంలోని అందమైన అమ్మాయిలు అందర్నీ అధికారులు వలవేసి పట్టుకుంటారు. గ్రామాల్లోని అందం, శరీర సౌష్టవం ఉన్న టీనేజీ అమ్మాయిలను గుర్తించి రాజధానికి తరలిస్తారు.

ఈ అందమైన అమ్మాయిలు అందర్నీ రాజప్రసాదంలో సేవలందించేందుకు ఉపయోగిస్తారు. ఈ విషయంలో ఇష్టం ఉన్నా, లేకపోయినా రాజప్రసాదంలో పనిచేయాల్సిందే. రాజు అంతఃపురం లో కుటుంబ సభ్యులకు సేవలందించే విశ్రాంతి భవనాల్లో వీరు పని చేయాల్సి ఉంటుంది. రాజ కుటుంబీకుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసుపత్రుల్లోనూ ఈ అందమైన అమ్మాయిలను వినోదం కోసం నియమిస్తారు. దారుణం ఏమిటంటే ఇలా అమ్మాయిలను రాజ కుటుంబం కోసం వాడుకోవడాన్ని అక్కడి ప్రజలు కనీసం వ్యతిరేకించరు. ఇదీ ఉత్తర కొరియా నియంత అరాచక పాలన.

Related posts