టాలీవుడ్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి పార్ట్ 1 విడుదల అయిన వెంటనే పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ స్వయంగా ప్రకటించాడు. ఆ తరువాత కూడా బాహుబలి 2 తరువాత అంటూ మాట మార్చాడు. బాహుబలి 2 రిలీజ్ తరువాత పెళ్లి వార్తలపై ప్రభాస్ స్పందించలేదు. దీంతో అభిమానులు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గతంలో సీనియర్ నటుడు ప్రభాస్ పెదనాన కృష్ణంరాజు కూడా పెళ్లి విషయంలో పలు ప్రకటనలు చేశాడు. త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని, అమ్మాయిని వెతికే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నారంటూ చాలా సార్లు చెప్పారు. ప్రభాస్ పెళ్లి విషయంలో ఫ్యామిలీ తొందర పడుతున్నప్పటికీ, ప్రభాస్ మాత్రం ఆ విషయంలో పెద్దగా ఆసక్తి కనబరుచుటలేదని చెప్పారు.
తాజాగా ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవీ స్పందించారు. ప్రభాస్ పెళ్లి గురించి మేం కూడా ఎదురుచూస్తున్నాం. ఆయన పెళ్లిపై ప్రస్తుతం వస్తున్న వార్తలన్నీ కల్పితమే, వాటిని చూసి మేము నవ్వుకుంటున్నామని చెప్పారు. జాన్ సినిమా పూర్తయిన తరువాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారు. మాది పెద్ద కుటుంబం కావటంతో అందరితో కలిసిపోయే అమ్మాయి కోసం వెతుకుతున్నాం. అలాంటి అమ్మాయి దొరగ్గానే ప్రభాస్ పెళ్లి అని ఆమె క్లారీటీ ఇచ్చారు.
ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ దే విజయం: ఉత్తమ్