telugu navyamedia
రాజకీయ

లతా మంగేష్కర్ మృతి – ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్

ప్ర‌ముఖ‌ సింగ‌ర్ లతా మంగేష్కర్ మృతికి ప్రధాని న‌రేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. ఆమె మరణం దేశానికి తీరని లోటని, ఈ వార్త విని ఎంతో బాధ పడుతున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.

ల‌తా మృతి ప‌ట్ల‌ ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్ గారి మరణంతో “నేను చెప్పలేనంత వేదనలో ఉన్నాను. దయ, శ్రద్ధ గల లతా దీదీ మమ్మల్ని విడిచిపెట్టారు. ఆమె మన దేశంలో పూరించలేని శూన్యాన్ని మిగిల్చింది. రాబోయే తరాలు ఆమెను భారతీయ సంస్కృతికి మారుపేరుగా గుర్తుంటుంది. ఆమె మధురమైన స్వరం ప్రజలను మంత్రముగ్ధులను చేసింది. లతా దీదీ పాటలు రకరకాల ఎమోషన్స్‌ని తీసుకొచ్చాయి.

RIP Lata Mangeshkar: PM Modi pays heartfelt tribute, says "She leaves a void in our nation that cannot be filled" | News24

ఆమె దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర ప్రపంచం మార్పులను దగ్గరగా చూసింది. సినిమాలకు అతీతంగా, ఆమె భారతదేశం అభివృద్ధిపై ఎల్లప్పుడూ మక్కువ చూపేది. ఆమె బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని కోరుకుంది. లతా దీదీ నుండి నేను అపారమైన ప్రేమను పొందడం నా గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో నా పరిచయం మరువలేనిది. లతా దీదీ మరణం నాకు బాధను కలిగించింది. ఓం శాంతి” అంటూ మోడీ ట్వీట్ చేశారు.

Lata Mangeshkar wishes best for PM Modi on his birthday | IndiaTV News | Bollywood News – India TV

లతాజీ మరణవార్త తెలిసిన దేశవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు శోశసంద్రంలో మునిగిపోయారు. అటు చిత్ర ప్రముఖులు, ఇటు రాజకీయ నాయకులు కూడా చింతిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లతాజీ మరణంపై ఆమె నివాళులు అర్పిస్తున్నారు.

Related posts