telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వ్యాక్సిన్ అభివృద్దిలో బ్రిటన్ మరో ముందడుగు!

Corona Virus Vaccine

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీకా తయారీ కోసం బ్రిటన్ మరో ముందడుగు వేసింది. ఆ దేశానికి చెందిన ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన టీకా తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. దీంతో తర్వాతి దశ ప్రయోగానికి శాస్త్రవేత్తలు రెడీ అయ్యారు. తొలి దశలో ఆందోళన కలిగించే దుష్ప్రభావాలేమీ కనిపించలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

రెండో దశలో 300 మందిపై ప్రయోగించనున్నట్టు తెలిపారు. ఈ దశలో 75 ఏళ్ల పైబడిన వారు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రయోగం కూడా విజయవంతమైతే అక్టోబరులో వేలాదిమందికి టీకా ఇస్తామని వివరించారు. బ్రిటన్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో టీకా పనిచేస్తోందా? లేదా? అన్నది నిర్ధారించడం కష్టమవుతోందని తెలిపారు. కాబట్టి మరో చోట దీనిని పరీక్షించాలని భావిస్తున్నట్టు ప్రయోగం నిర్వహిస్తున్న శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్న రాబిన్ షాటాక్ తెలిపారు.

Related posts