telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

జగన్ సమక్షంలో.. అవంతి శ్రీనివాస్ వైసీపీలోకి..

avanti srinivas into ycp

జగన్‌ సమక్షంలో విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్‌ వైకాపాలో చేరారు. తెదేపా తరఫున అనకాపల్లి ఎంపీగా గెలిచిన అవంతి శ్రీనివాస్‌ లోక్‌సభ చివరి సమావేశాలు ముగిసిన మరుసటి రోజే పార్టీ మారారు. ఈరోజు మధ్యాహ్నం అవంతి శ్రీనివాస్‌తో వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, బొత్స సత్యనారాయణ సమావేశమై చర్చించారు.

అనంతరం వారితో కలిసి లోటస్‌ పాండ్‌కు వెళ్లిన అవంతి శ్రీనివాస్‌కు జగన్‌.. వైకాపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భీమిలి ఎమ్మెల్యే టికెట్‌తో పాటు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని అవంతి శ్రీనివాస్‌కు వైకాపా నుంచి గట్టి హామీ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.

మరోపక్క అమలాపురం టీడీపీ ఎంపీ పి.రవీంద్రబాబు కూడా వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ వార్తలపై రవీంద్రబాబు స్పందించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని ఆయన చెప్పారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని అన్నారు. చంద్రబాబుపై తనకు పూర్తి విశ్వాసం ఉందని… ఆయన ఎలా చెబితే అలా నడుచుకుంటానని తెలిపారు.

Related posts