telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిరాడంబరంగా నితిన్ ఎంగేజ్‌మెంట్

Nithin

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లి వేడుక ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని ఓ లగ్జరీ హోటల్‌లో జరుగనుంది. మరో నాలుగు రోజుల్లో షాలినీ మెడలో నితిన్ మూడు ముళ్లు వేయనున్నాడు. తాజాగా ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం పూర్తయింది. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇరు వైపుల వారు తాంబూళాలు మార్చుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులను ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, తన అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌తో పాటు మరికొంత మంది సన్నిహిత మిత్రులను నితిన్ ఆహ్వానించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, షాలినీ పసుపు కుంకుమ వేడుక జరిగిన సంగతి తెలిసిందే.

Related posts