telugu navyamedia
సినిమా వార్తలు

సల్మాన్ కోసం అమీర్ సినిమాను వదులుకున్న అలియా

Alia-Bhatt

20 ఏళ్ళ త‌ర్వాత సంజయ్ లీలా భన్సాలీ, సల్మాన్ ఖాన్ కాంబినేష‌న్‌లో “ఇన్షా అల్లా” అనే ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఈద్‌కి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నామని దర్శకనిర్మాతలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది అలియా. వచ్చే మంగళవారం నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వళ్లనుందని సల్మాన్ ట్వీట్ చేశాడు. వచ్చే ఏడాది రంజాన్‌కు ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ వలన మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమాను వదులుకుంది హాట్ బ్యూటీ అలియా భట్. దీనికి కారణాలను అలియా వివరిస్తూ… “అమీర్ సినిమాను వదులుకోవడం చాలా నిరాశ పర్చింది. ఎందుకంటే ఆయన సినిమాకు ముందు సల్మాన్‌ఖాన్‌తో ఇన్షా అల్లా అనే సినిమాకు సైన్ చేశా. డేట్స్ అన్నీ ఆ సినిమాకే కేటాయించడంతో అమీర్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు. ఇలాంటి సిచ్యువేషన్‌లోనే ఆయన సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అలాగే అదే సమయంలో సల్మాన్‌తో సినిమా చేయడం చాలా ఆనందంగానూ ఉంది. “ఇన్షా అల్లా” సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌లో చేయడం చాలా అరుదు, సంతోషం కూడా” అని ఆమె అన్నారు. ఇంతకు ముందు అలియా షారూఖ్ ఖాన్‌తో “డియర్ జిందగీ” అనే సినిమాలో నటించింది.

Related posts