తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ కి ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల స్థితిగతులపై బండి సంజయ్‌ని వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ. దాదాపు 10 నిమిషాల పాటు, ఎన్నికల సరళి పై పార్టీ పరిస్థితుల పై ముచ్చటించారు ప్రధాని. కార్యకర్తలు అధ్బుతంగా పోరాటం చేశారని అభినందించారు ప్రధాని మోడీ. నాయకుల, కార్యకర్తల పైన జరిగిన దౌర్జన్యం పై ప్రధాని మోడీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీని విజయ తీరాలకు చేర్చడానికి అన్ని విధాలా పోరాడిన తెలంగాణ శాఖ కార్యకర్తల పోరాట పటిమను ఈ సందర్భంగా కొనియాడారు మోడీ.నూతన ఉత్సాహంతో పార్టీ క్యాడర్ నడుచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ధైర్యంగా ముందుకు సాగాలని అన్ని విధాలా అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ.
previous post
next post
ఓట్ల కోసమే అలా చేస్తుంది.. ప్రియాంకపై స్మృతి ఇరానీ ఘాటు వ్యాఖ్యలు