*2014 ఎన్నికల్లో ఎవరి పల్లకీ మోశారు.
*చంద్రబాబును మోయడం..చంద్రబాబు భజన చేయడమే పవన్‌కు తెలుసు..
*పవన్ మాటల్లో క్రెడిబులిటీ లేదు..
*పవన్ హాబీగా పాలిటిక్స్ చేస్తున్నారు..
*పవన్ ఫుల్‌టైమ్ పొలిటీషియన్ కాదు..పార్ట్‌టైమ్ పొలిటీషియన్..
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. పవన్ హాబీగా రాజకీయాలు చేస్తున్నారు. పవన్ ఫుల్‌టైమ్ పొలిటీషియన్ కాదు. అవకాశవాద రాజకీయాలకు పవన్ కల్యాణ్ కేరాఫ్ అడ్రస్ అంటూ పేర్ని నాని ఫైరయ్యారు.
పవన్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. పవన్ మాటలకు నిబద్ధత ఉందా.. మాటకు కట్టుబడ్డాడా.. పవన్‌లా మాట మార్చితే ప్రజలు చెప్పుతో కొడతారు.
పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబును కలిశాను అంటారు. ఆయనేమన్నా ఎన్నికల కమిషనరా? పార్టీ పెట్టి చంద్రబాబును కలవడం ఎందుకు అని పేర్నినాని ప్రశ్నించారు.
2014లో పవన్ ఎవరి పల్లకీ మోశాడు’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు.ప్రత్యేక హోదా ఇవ్వలేదనితిట్టి .. బీజేపీకి నాకు సంబంధం లేదని చెప్పిన పవన్ వాళ్లతోనే పొత్తు పెట్టుకున్నారంటూ మంత్రి దుయ్యబట్టారు.
పార్టీ పెట్టిన మొదట్లో చేగువేరా అని తిరిగిన పవన్.. ఇప్పుడెందుకు ఆయన పేరు ఎత్తట్లేదని ప్రశ్నించారు. పవన్‌కు చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం. చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినట్లుందని చెప్పారు. పవన్ కల్యాణ్ నా ఫ్యాన్ అంటూ వ్యాఖ్యానించారు
జగన్ కేసులు… టీడీపీ పుంజుకుంటుంది… అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు