telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కుల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని ఐదు,ఆరుగురు మంత్రులకు ఛాన్స్ ..

*కొడాలి నాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..
*ఆస‌క్తిక‌రంగా సాగిన ఏపీ క్యాబినేట్ మీటింగ్‌..
*మంత్రుల్లో ఐదు, ఆరుగురికి తిరిగి అవకాశం లభించే అవకాశం..

 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా తాను మాత్రం జగన్ కోసం.. పార్టీ కోసం పని చేస్తానని కొడాలి నాని అన్నారు .

ఏపీ కేబినెట్‌ బేటీ ముగిసిన అనంతరం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు . సీఎం నిర్ణయానికి ప్రతి ఒక్కరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ నెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం ఉంటుందని సీఎం తెలిపారని మంత్రి కొడాలి నాని అన్నారు. 

మొత్తం 24 మంది మంత్రులు రాజీనామా సమర్పించినట్లు తెలిపారు. పాత మంత్రుల్లో అయిదారుగురు కేబినెట్‌లో కొనసాగే అవకాశం ఉందని అన్నారు. అయితే ఎవరిని కొనసాగిస్తామనే వారి పేర్లను సీఎం చెప్పలేదని నాని స్పష్టం చేశారు. 

అనుభవం రీత్యా కొంత మంది మంత్రులు తనతో పాటు కంటెన్యూ అవుతారని సీఎం చెప్పారని పేర్కొన్నారు. కొత్త కాబినేట్‌లో మీరు కొనసాగే అవకాశం ఉందా అని ప్రశ్నించగా..తనకు తక్కువ అవకాశాలు ఉన్నట్లు కొడాలి నాని తెలిపారు. కుల సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంత్రి పదవులుంటాయని తెలిపారు.

Related posts