telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఫార్మా కంపెనీలో పేలుడుపై విచారణ చేపడుతాం: కలెక్టర్

Fire

విశాఖ జిల్లా ఫార్మా కంపెనీలో పేలుడుపై విచారణ చేపడుతామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపించడానికి కలెక్టర్ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి‌ నివేదిక ఇవ్వాలని ఆయన ఆ కమిటీలోని సభ్యులను కోరారు.

జిల్లాలోని పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ సంస్థలో గత రాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ సంస్థలో డై మిథైల్ సల్ఫాక్సైడ్ వల్ల భారీ మంటలు చెలరేగినట్లు వినయ్ చంద్ చెప్పారు. విశాఖపట్నంలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటోన్న నేపథ్యంలో తాము‌ మరోసారి జిల్లా స్థాయి సమీక్ష కూడా నిర్వహించి, చర్యలు తీసుకుంటామని వివరించారు.

సాల్వెంట్స్‌ సంస్థలో వాల్వ్ దగ్గర శాంపిల్ తీసుకుంటున్నప్పుడు విద్యుత్ స్పార్క్ ఏర్పడి ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు భావిస్తున్నారు. ఆ సంస్థలో అర్హతలేని వ్యక్తి‌ కెమిస్ట్‌గా పని చేస్తున్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. అవగాహన లేని వారిని సంస్థలు పనుల్లో నియమించుకుంటున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.

e

Related posts