telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పేపర్ బాయ్ గా మారిన టీడీపీ ఎమ్మెల్యే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే విన్నూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఇంటింటికీ పేపర్లు వేసుకుంటూ పేపర్లు వేసుకుంటూ పేపర్ బాయ్ గా మారారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభసభ్యుడు నిమ్మల రామానాయుడు ఇంటింటికీ పేపర్లు వేసుకుంటూ పేపర్ బాయ్ గా మారారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో దినపత్రికలను పంపిణీ చేశారు.

ఆదివారం తెల్లవారు జాము నుంచే ఆయన పట్టణంలోని చందాదారుల ఇళ్లకు వెళ్లి దినపత్రికలను పంపిణీ చేశారు. పట్టణంలోని 31వ వార్డులో స్థానిక పేపర్ బాయ్స్‌తో కలిసి సైకిల్ పై ఇంటింటికీ వెళ్లి పత్రికలను పంపిణీ చేశారు.

దినపత్రిక తీసుకునేందుకు వచ్చిన వారికి.. టిడ్కో ఇళ్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ఇందుకు కారణాన్ని ఆయన ప్రత్యేకంగా వివరించారు.

టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడంలో ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ పత్రికలను పంచానని నిమ్మల రామానాయుడు తెలిపారు.  టిడ్కో ఇళ్లను గత ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసింది. మిగిలిన పది శాతం పూర్తి చేసి ఇవ్వాలని నిమ్మల రామానాయుడు ఈ విధానాన్ని ఎంచుకున్నారు.

అంతే కాకుండా ప్రతి నెలా నాలుగు రోజులు ఇలా పేపర్లు వేసుకుంటూ చందాదారులను కలిసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి తెలియజేస్తానని చెప్పారు. మరో నాలుగు రోజుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి నిరసన తెలుపుతానని తెలిపారు .

 

Related posts