telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నందిగామ విద్యార్ధిని హ‌రిత హ‌త్య కేసులో ఏడుగురు అరెస్ట్‌..

*విద్యార్ధిని హ‌రిత హ‌త్య కేసులో ఏడుగురు అరెస్ట్‌
*ముగ్గురు మేనేజ‌ర్లు..న‌లుగురు ఏజెంట్లు అరెస్ట్‌
*నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని త‌ల్లి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ హరిత వర్షిణి ఆత్మహత్య కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముగ్గురు మేనేజర్లు, నలుగురు రికవరీ ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి సమక్షంలో వత్సవాయి పోలీసు స్టేషన్లో ఏజెన్సీ మేనేజర్లు చలువ మున్నేధర్ రెడ్డి, సింగిరెడ్డి వెంకటేశ్వరావు , బూరుగు మాధురి, రికవరీ ఏజెంట్లు చిర్రా పవన్ కుమార్, కురుషోటి భాగ్యతేజ ,చల్లా శ్రీనివాసరావు , గజ్జలకొండ వెంకట శివ నాగరాజును విచారించారు .

హరిత కుటుంబ సభ్యులను అవమానించామని నిందితులు ఒప్పుకున్నారు.ఎజెంట్లు ఇంటికి వ‌చ్చి విద్యార్థి హరితను అన‌రాని మాటలు అన‌టంతో అవ‌మాన భారంగా భావించి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లుగా పోలీసులు నిర్దారించారు.విజయవాడ కేంద్రంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి కస్టమర్లపై వేధింపులకు దిగుతున్నారన్నారు.

వివ‌రాల్లోకి వెళితే..

హరిత వర్షిని తండ్రి ప్రభాకర్ రావు రెండు క్రెడిట్ కార్డుల ద్వారా రూ.6,35,000 నగదు లోన్ తీసుకున్న‌ట్లుగా పోలీసుల విచారణలో గుర్తించారు. గత నెల 26వ తేదీన మొదటిసారి ఇద్దరు వ్యక్తులు, రెండోసారి ఇద్దరు వ్యక్తులు ప్రభాకర్ ఇంటికెళ్లిన లోన్ రికవరీపై వేధించారు. అక్క‌డే ఉన్న కుటుంబ సభ్యులతో దురుసుగా ప్రవర్తించిన రికవరీ ఏజెంట్లు, హరితని చూస్తూ వెకిలిగా వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు తీవ్రమైన పదజాలంతో దూషించారు. ఆ త‌రువాత మనస్తాపం చెందిన హ‌రిత‌ ఆత్మహత్య చేసుంది.

ఆర్థిక ఇబ్బందుల వల్ల స్కూల్ ఫీజు కట్టలేక, తన కుటుంబం ఉండడంతో సూసైడ్ నోట్ రాసి వంటగదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డింది. ఆ త‌రువాత ఆమె సూసైడ్ నోట్ వెలుగులోకి రావ‌టంతో ఘ‌ట‌న సంచ‌ల‌నం అయ్యింది. ఈ వ్య‌వ‌హ‌రంపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. విచార‌ణ చేప‌ట్టి న పోలీసులునిందితుల‌ను అరెస్ట్ చేశారు

Related posts