telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలి: సీఎం జగన్

cm jagan ycp

కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికోసం అనుసరించాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని అధికారులకు సూచించారు. అందులో 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

వివిధ రాష్ట్రాల్లో ఉన్నవారే కాకుండా, విదేశాల్లో ఉన్నవారు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉన్నందున కనీసం లక్ష బెడ్లు సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసర రవాణా వాహనాలుగా మార్చాలని, మొబైల్ యూనిట్లలో మందులు కూడా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

Related posts