telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ ను వణికించిన భూకంపం..15 మంది దుర్మరణం

earth quake pakistan

పాకిస్థాన్ లో భారీ భూకంపం సంభవించింది. లాహోర్ కు వాయవ్య దిశగా 173 కిలోమీటర్ల దూరంలో సంభవించిన భూకంపం పాకిస్థాన్ ను వణికించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం ధాటికి పాక్ లో 15 మంది వరకు మరణించారు. 150 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. భూకంపం ధాటికి ఇళ్లు, ఆఫీసులు ధ్వంసమయ్యాయి. భూకంపం ధాటికి ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు తీశారు.

లాహోర్, రావల్పిండి, పెషావర్, ఇస్లామాబాద్ నగరాలతో పాటు సియోల్‌కోట్, సర్గోదా, మన్‌సెహ్రా, చిత్రాల్, మాల్‌ఖండ్, ముల్తాన్, షంగ్లా, బజౌర్ ప్రాంతాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. మరోవైపు ఈ భూకంపం ప్రభావం ఉత్తర భారతదేశంలోనూ కనిపించింది. సాయంత్రం 4.35 గంటల ప్రాంతంలో ఢిల్లీతో పాటు ఛండీగఢ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానాలలోనూ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

Related posts