telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పెరిగిన ఇసుక రేటు డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి?: చంద్రబాబు

chandrababu

ఇసుక రేటు పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. ఇసుక లేక లక్షలాది కార్మికులు జీవనోపాధి కోల్పోయారని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక రేటెంత, వైసీపీ వచ్చాక ఎంత పెరిగింది అని ప్రశ్నించారు. నాలుగు నెలల్లోనే ఇసుక రేటు నాలుగైదు రెట్లు పెరిగిందన్నారు. పెరిగిన ఇసుక రేటు డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి? అంటూ మండిపడ్డారు.

ఇసుక లేక రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ పనులు మందగించాయని తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న విధానాల కారణంగా 20 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ప్రజలకు ఇసుక సరఫరా చేసేందుకు వరదలు అడ్డొస్తే, అనంతపురం మీదుగా కర్ణాటక తరలిపోతున్న ఇసుక ఎవరిది? జగ్గయ్యపేట మీదుగా తెలంగాణ తరలిపోతున్న ఇసుక ఎవరిది? అంటూ ప్రశ్నించారు.

Related posts